ధనుస్సు
అంచనాలు కొన్ని వ్యవహారాలలో తప్పి నిరాశ చెందుతారు.
ఆదాయం నిరాశాజకనంగా ఉన్నా అవసరాలకు కొంత చేతికందుతుంది.
సన్నిహితులతో సంబంధ బాంధవ్యాలు మరింత మెరుగుపర్చుకుంటారు.
కాంట్రాక్టర్ల యత్నాలు మందగిస్తాయి.
బంధువర్గంతో కొన్ని ముఖ్య విషయాలు చర్చిస్తారు.
వివాదాలు, ప్రేమలకు దూరంగా మసలుకోవడం ఉత్తమం.
ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది,
ప్రతి విషయంలోనూ కష్టపడతారు కానీ ఫలితం నామమాత్రంగా ఉంటుంది.
వృత్తులు, వ్యాపారాల వారు లక్ష్యాలను సాధించేందుకు శ్రమపడాలి.
రాజకీయవేత్తలు, వైద్యులు, కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.
మహిళలు మానసిక వేదన.
16,17 తేదీల్లో శుభ వార్తలు. వాహన యోగం. చర్చలు సఫలం.