తుల
అనుకోని ఇబ్బందులు, సమస్యలు ఎదురుకావచ్చు.
అయినా మనోబలంతో అధిగమిస్తారు.
ఖర్చులు తగ్గించుకుని ఆర్థికంగా జాగ్రత్తపడతారు.
బంధువులు, స్నేహితులు మీపై మరిన్ని నెపాలు మోపుతారు.
విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి.
నిరుద్యోగులకు కొంత ఆందోళన కలిగినా క్రమేపీ అనుకూల సందేశాలు రాగలవు.
శత్రువులను కూడా ఆకట్టుకుంటారు.
ఆపదలో ఉన్న వారిని సైతం ఆదుకుంటారు.
ఆస్తుల వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు.
సామాజిక సేవాకార్యక్రమాలు చేపట్టి అందరినీ ఆకర్షిస్తారు.
వృత్తులు, వ్యాపారాలలో కొన్ని అవాంతరాలు వచ్చినా పట్టుదలతో పరిష్కరించుకుంటారు.
కళాకారులు, పరిశోధకులకు మిశ్రమ ఫలాలు ఉంటాయి.
మహిళలకు కాస్త ఊరటనిచ్చే సమాచారం అందుతుంది.
12,13 తేదీల్లో శ్రమ తప్పదు.
కొన్ని విషయాలలో రాజీ మార్గం ఎంచుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు.