మిథునం
అనుకున్న రీతిలో కార్యక్రమాలలో కదలికలు లేక నిరాశ చెందుతారు.
తల్లి తరఫు వారితో అకారణంగా విభేదాలు నెలకొంటాయి.
కొంత గందరగోళం మధ్య మనశ్శాంతి కోల్పోతారు.
ప్రతి విషయంలోనూ మరింత అప్రమత్తత పాటించడం మంచిది.
ఆలోచనలు ఎటూ తేలక నిర్ణయాలలో ప్రతిష్ఠంభన.
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపడం మంచిది.
ఆదాయానికి లోటు ఏర్పడడంతో సర్దుబాట్లకు అవస్థలు పడతారు.
బంధువులు, స్నేహితులు అన్ని విషయాలలో ఆటంకాలు కల్పించడం బాధిస్తుంది.
ఇంత కాలంగా నెట్టుకొస్తున్న కొన్ని వ్యవహారాలు ముందుకు సాగని పరిస్థితి.
అయితే ఒక ఊహించని వ్యక్తి ద్వారా అన్నింటా సహాయం లభిస్తుంది.
చిత్రవిచిత్రమైన సంఘటనలు ఎదురై ఆశ్చర్యపోతారు.
వృత్తులు,, వ్యాపారాలలో ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి.
రాజకీయవేత్తలు, క్రీడాకారులు, సాంకేతిక నిపుణులకు మధ్యస్థమైన ఫలితాలు ఉంటాయి.
మహిళలకు అశాంతి తప్పదు.
17,18 తేదీల్లో ధనప్రాప్తి.
సమాజంలో గౌరవం. వస్తు లాభాలు.