కర్కాటకం
మీ అంచనాలు తప్పి కొంత గందరగోళంలో పడతారు.
రావలసిన డబ్బు సమయానుసారం అందక ఎవరినో ఒకరిని ఆశ్రయించాల్సిన సమయం.
భార్యాభర్తల మధ్య సమస్యలు, వివాదాలు నెలకొంటాయి.
అతి ముఖ్య నిర్ణయాలపై తొందరపడకుండా నిదానం పాటించడం ఉత్తమం.
చేపట్టిన కార్యక్రమాలలో అవరోధాలు ఏర్పడవచ్చు.
ఆరోగ్యపరమైన చికాకులతో అవస్థలు పడతారు.
కొన్ని విషయాలలో కష్టమే మిగులుతుంది.
ప్రత్యర్థులతో సైతం చికాకులు తప్పకపోవచ్చు.
మీ వ్యక్తిగత విషయాలు గోప్యంగా ఉంచుకోండి. ఎవరితోనూ పంచుకోవద్దు.
ఇంటి నిర్మాణాలు, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తప్పకపోవచ్చు.
వృత్తులు, వ్యాపారాలలో సామాన్యంగా గడుస్తుంది.
కళాకారులు, పరిశోధకులు, క్రీడాకారులు ప్రోత్సాహం కరవై నిరాశ చెందుతారు.
మహిళలు కొంత మనస్తాపానికి గురవుతారు.
13,14 తేదీల్లో అత్యంత కీలక సందేశం. స్వల్ప ధన లాభం.
పరిచయాలు పెరుగుతాయి.