మకరం
అతి ముఖ్య వ్యవహారాలు సాఫీగా పూర్తి చేసి ఊరట చెందుతారు.
ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.
సంఘంలో ప్రత్యేకతను నిలుపుకుంటారు.
ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది.
రాబడికి ఢోకాలేకుండా అవసరాలు తీరతాయి.
నిరుద్యోగులు, విద్యార్థులకు కార్యసిద్ధి.
ఆప్తులపై ప్రేమానురాగాలు చూపుతారు.
అలాగే, వారి నుండి ఆదరణ పొందుతారు.
హోదాలు కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు.
విద్యార్థులకు మరిన్ని అవకాశాలు దక్కే సూచనలు.
వృత్తులు, వ్యాపారాలలోని వారు సమర్థతను చాటుకునేందుకు తగిన కాలం.
రాజకీయవేత్తలు, కళాకారులు, పరిశోధకులు ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు.
మహిళలకు ఉత్సాహం పెరుగుతుంది.
12,13 తేదీల్లో ఆకస్మిక ప్రయాణాలు. రుణ యత్నాలు.