మిథునం
ఆదాయం అంతగా అనుకూలించక ఇబ్బంది పడతారు.
ఆలోచనలు అంతగా కలిసిరావు.
పరిస్థితులు అనుకూలించక డీలాపడతారు.
కొన్ని విమర్శలు ఎదుర్కొంటారు.
అయినా సడలని పట్టుదలతో కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు.
ఆత్మీయులు, బంధువులు మీ పై ఒత్తిళ్లు పెంచుతారు.
స్థిరాస్తి వివాదాలు మరింత ముదిరే అవకాశాలున్నాయి.
ప్రతి నిర్ణయంలోనూ మరింత నిదానం పాటించాలి.
భవిష్యత్తు పై విద్యార్థులకు కొంత గందరగోళం తప్పకపోవచ్చు.
వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు.
తీర్థ యాత్రలు చేస్తారు.
తరచూ ప్రయాణాలు చేస్తారు.
చిన్ననాటి స్నేహితుల నుంచి కొంత సహాయసహకారాలు అందుకుంటారు.
సంతానపరంగా సమస్యలు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు.
వ్యాపారులు ఆశించిన లాభాలు రాకున్నా వెనుకంజవేయరు.
ఉద్యోగులకు మార్పులు అనివార్యం.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పర్యటనలు మధ్యలో వాయిదా పడతాయి.
మీడియా, ఐటీ రంగాల వారికి సామాన్యంగానే ఉంటుంది.
వారాంతంలో శుభవర్తమానాలు.
ఆకస్మిక ధనలాభం. ప్రత్యర్థులతో అగ్రిమెంట్లు.