వృషభం
రాబడి నిరాశాజకనంగా ఉండి అప్పులు చేస్తారు.
ఆత్మీయులు సైతం వ్యతిరేకత చూపుతారు.
అయినా ఆత్మవిశ్వాసం, నేర్పుతో సమస్యలు అధిగమిస్తారు.
ప్రతి నిర్ణయంలోనూ నిదానం పాటించండి.
అవసరం మేరకు మాట్లాడుతూ ముందుకు సాగడం మంచిది.
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం రావచ్చు.
ఇంటి నిర్మాణాలు, కొనుగోలు ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి.
క్రీడ, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
విద్యార్థులు సత్తా చాటుకుంటారు.
ఆస్తి వ్యవహారాలలో ఒడిదుడుకులు, వివాదాలు తీరి లబ్ధి చేకూరుతుంది.
విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం దక్కుతుంది.
వ్యాపారులకు లాభాలు ఊరిస్తాయి.
ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఒత్తిడులు క్రమేపీ తొలగుతాయి.
పారిశ్రామికవేత్తలు కష్టసాధ్యమైనా పట్టుదలతో లక్ష్యాలు సాధిస్తారు.
శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి.
సంతానం విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
వారం మధ్యలో బంధువుల కలయిక. వస్తు లాభాలు.