కుంభం (23 జనవరి - 22 ఫిబ్రవరి)
వీరికి గతం కంటే అన్ని విషయాలలోనూ మెరుగ్గానే ఉంటుంది.
ముఖ్యంగా అందరిలోనూ గౌరవం పెరుగుతుంది.
ఆదాయం పెరిగి ఉల్లాసంగా గడుపుతారు.
దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఈతిబాధలు, మానసిక అశాంతి వంటివి క్రమేపీ తొలగుతాయి.
స్వతంత్ర నాయకత్వ లక్షణాలతో అందర్నీ ఆకట్టుకుంటారు.
ఏ పని చేపట్టినా దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
ముఖ్యంగా మధ్యకాలం మరింత శుభదాయకం.
బంధువుల సహాయ సహకారాలు అందుతాయి.
తరచూ తీర్థయాత్రలు, ధార్మిక కేంద్రాలు సందర్శిస్తారు.
ప్రముఖులు మీ నైపుణ్యతను ప్రశంసిస్తారు.
ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు ఆగస్టు నుంచి అనుకూలిస్తాయి.
మీతో పాటు, కుటుంబంలో కొందరి ఆరోగ్య విషయాలు కొంత చికాకు పరుస్తాయి.
వ్యాపార, వాణిజ్యవేత్తలు అందిన పెట్టుబడులను సజావుగానే వినియోగిస్తారు.
ఉద్యోగుల కలలు ఫలిస్తాయి. పదోన్నతుల కోసం నిరీక్షణ ఫలించే సమయం.
పారిశ్రామికవేత్తలు ఇంత కాలం ఎదుర్కొన్న సమస్యల నుంచి బయటపడతారు.
రాజకీయనేతలు తమ సత్తా, అనుభవాన్ని చాటుకుంటారు.
కళాకారులు మరిన్ని విజయాలకు చేరువగా నిలుస్తారు.
విద్యార్థులు విదేశీ విద్యాభ్యాసం కోసం కృషి చేస్తారు.
నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.
వ్యవసాయదారులు ఊహించని పెట్టుబడులు అందుకుంటారు.
ఏప్రిల్, జూన్,అక్టోబర్, నవంబర్ నెలలు విశేషంగా ఉంటాయి. మిగతావి మిశ్రమ ఫలితాలో కూడి ఉంటాయి.