కన్య (23 ఆగష్టు - 22 అక్టోబర్)
అనుకున్న ఏ కార్యక్రమమైనా కొంత ఆలస్యంగా పూర్తి చేస్తుంటారు.
కొందరు మిత్రుల వైఖరి కొంత ఇబ్బందిగా మారవచ్చు.
ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్నా అవసరాలకు సొమ్ములు అందుతునే ఉంటాయి.
బంధువులతో కొన్ని వ్యవహారాలలో విభేదిస్తారు.
గత కొంతకాలంగా వెంటాడుతున్న ఒక సమస్య పరిష్కారానికి యత్నిస్తారు.
ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగండి.
కోర్టు కేసులు, ఆస్తి వివాదాల నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుంది.
ప్రయాణాలలో కొన్ని మోసాలకు గురయ్యే వీలుంది. అప్రమత్తత అవసరం.
శుభకార్యాల నిర్వహణకు తగిన ఏర్పాట్లు చేసుకుంటారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు మధ్యకాలంలో అధికంగా లాభాలు అందుతాయి.
ఉద్యోగులకు పైస్థాయి వారి నుంచి ఒత్తిడులతో పాటు కొన్ని ప్రశంసలు కూడా రావచ్చు.
సమర్థత చాటుకుంటూ పట్టుదలతో ముందుకు సాగండి.
రాజకీయవేత్తలకు మరిన్ని ఆశలు చిగురిస్తాయి.
పారిశ్రామికవేత్తలు, క్రీడాకారులకు కొన్ని నిర్ణయాలు మార్చుకోవలసిన పరిస్థితి.
శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి అక్టోబర్ నుండి విశేష కాలం.
కళాకారులకు సంతోషకరమైన సమాచారాలు అందుతూ ఉంటాయి.
విద్యార్థులు మేథస్సుకు పదునుపెట్టి అవకాశాలు సాధిస్తారు.
వ్యవసాయదారులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.
జనవరి, మే, జూలై నవంబర్ నెలకు అనుకూలం. మిగతావి సామాన్యం.