సింహం (23rd July – 22nd August)
వ్యూహాత్మక వైఖరితో ముందుకు సాగి కొన్ని విజయాలు సొంతం చేసుకుంటారు.
అనుకున్న కార్యక్రమాలను పూర్తి చేయడంలో కష్టాలను అధిగమిస్తారు.
రాబడి మధ్యమధ్యలో తగ్గినా అవసరాలకు ఏదోరకంగా సమకూరుతూ ఉంటుంది.
చిరకాల మిత్రులు, దూరపు బంధువులను ఎట్టకేలకు కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.
విద్య, ఉద్యోగావకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.
ఒక సమాచారం మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది.
ఇంట్లో గత ఏడాది నిలిచిపోయిన శుభకార్యాలు ప్రస్తుతం నిర్వహిస్తారు.
అనుకున్న సమయానికి నిర్ణయాలు తీసుకుని లబ్ధి పొందుతారు.
సోదరులతో ఎంతోకాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు, వివాదాలు పరిష్కరించుకుంటారు.
కాంట్రాక్టర్లు, రియల్టర్లు తమ అనుభవాలతో మరిన్ని అవకాశాలు సాధిస్తారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో మరింత చురుగ్గా పాల్గొంటారు.
వ్యాపారస్తులు, ఉద్యోగులు తమ సమర్థత, నైపుణ్యతను నిరూపించుకునేందుకు తగిన సమయం.
పారిశ్రామికవేత్తలు, పరిశోధకులకు సంతోషకదాయకంగా ఉంటుంది.
కళాకారులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. పూర్వవైభవం సాధిస్తారు.
రాజకీయనేతలకు పదవీయోగం కలిగే సూచనలు.
వ్యవసాయదారులు మరింతగా లాభపడతారు.
మహిళలకు కొంత కాలంగా ఎదురవుతున్న ఇబ్బందులు తొలగుతాయి.
ఫిబ్రవరి, మార్చి, జూలై, సెప్టెంబర్, నవంబర్ నెలల్లో అన్ని వ్యవహారాలలోనూ అప్రమత్తంగా మెలగాలి.
ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. స్థాన చలనాలు ఉండవచ్చు.
అదృష్టసంఖ్య...1.
సూర్య భగవానుడిని మరియు వెంకటేశ్వర స్వామి ని పూజించడం మంచిది