తుల (23rd September -22nd October)
కుటుంబ సభ్యులను ఎంత ఒప్పించేందుకు యత్నించినా వారి వైఖరి మారక నిరాశ చెందుతారు.
ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగానే కొనసాగి కొత్త అప్పులకు యత్నిస్తారు.
మరో వైపు వృథా ఖర్చులు పెరుగుతాయి.
ఇంటాబయటా సమస్యలతో సహవాసం చేస్తారు.
వాటి పరిష్కారానికి చేసే యత్నాలు కొంత ఫలిస్తాయి.
ఆస్తుల విషయంలో జ్ఞాతులతో వివాదాలు నెలకొనే అవకాశం.
మీనిర్ణయాలపై పునరాలోచనలో పడతారు.
చేపట్టిన కార్యక్రమాలలో వేగం తగ్గి నిదానంగా సాగుతాయి.
ఆరోగ్య విషయాల పట్ల శ్రద్ధ వహించడం మంచిది.
అలాగే, వాహనాలు నడిపే వారు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన సమయం.
వ్యాపార, వాణిజ్యవేత్తలు పెట్టుబడులు భారీగా పెట్టినా లాభాలు అంతంతగానే ఉండవచ్చు. విస్తరణ కార్యక్రమాలను నిలిపివేస్తారు.
ఉద్యోగాలలో సహచరులు మీ ప్రగతికి ఆటంకాలు కల్పించే వీలుంది.
అనుకున్న ప్రమోషన్లు రాక నిరాశ చెందుతారు.
విద్యార్థులకు కాస్త ఉపశమనం కలుగుతుంది.
పారిశ్రామిక, సాంకేతికవర్గాల వారు సంస్థల్లో ప్రతికూల పరిస్థితులు నెలకొని ఇబ్బందిపడతారు.
సినీ, టీవీ కళాకారులు దక్కిన అవకాశాల పై నిర్ణయాలలో తొందరపడరాదు.
రాజకీయవేత్తలకు విమర్శలు పెరిగి ఉక్కిరిబిక్కిరి కాగలరు.
వ్యవసాయదారులు చాలీచాలని పెట్టుబడులు సమకూరి నిరుత్సాహం చెందుతారు.
అయితే రెండోభాగంలో కొంత మార్పు ఉండవచ్చు.
పరిస్థితులు మారతాయి.
అదృష్టసంఖ్య–6.
ఫిబ్రవరి, మార్చి, జూలై, ఆగస్టు, డిసెంబర్ నెలలలో మీ అంచనాలకు తగినట్లుగానే ఉంటుంది.