మీనం (23rd February – 20th March)
చిత్రవిచిత్రమైన రీతిలో జీవితం సాగిపోతుంది.
పూర్తయినట్లు అనిపించిన కార్యక్రమాలు తిరిగి మొదటికి వస్తాయి.
పరిస్థితులు చక్కబడినా ఏదో ఒక అసంతృప్తి తప్పదు.
ఆదాయం దక్కినా అవసరాలకు సరిపడని పరిస్థితి ఉంటుంది. తద్వారా రుణాలు చేయాల్సి ఉంటుంది.
కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల పై విభేదిస్తారు.
కొద్ది కాలం వారితో దూరంగా మసలుతారు. అయితే క్రమేపీ సర్దుకుంటాయి.
తరచూ నిర్ణయాలు మార్చుకోవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి.
విద్యార్థులకు ఊహించని అవకాశాలు కొన్ని దక్కవచ్చు.
స్థిరాస్తుల కొనుగోలు ప్రయత్నాలలో సోదరుల సహాయం అందుతుంది.
కాంట్రాక్టర్లు, రియల్టర్లు కాస్త ఊపిరి పీల్చుకునేందుకు వీలు కలుగుతుంది.
తరచూ వాహనాలు మారుస్తారు.
వ్యాపార, వాణిజ్యవర్గాల యత్నాలు ఫలిస్తాయి. భాగస్వాముల మధ్య మరింత సయోధ్య ఏర్పడుతుంది.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మధ్యమధ్యలో అవాంతరాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.
వ్యవసాయదారులకు ద్వితీయార్థం మరింత అనుకూలమైన సమయం.
మహిళలకు కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి.
ఫిబ్రవరి,ఏప్రిల్, జూన్, సెప్టెంబర్, అక్టోబర్ నెలలు కొంత క్లిష్టంగా గడుస్తాయి.
ఆరోగ్య, కుటుంబ సమస్యలు చికాకు పరుస్తాయి. అంచనాలలో పొరపాట్లు.
మొత్తం మీద ఈ కాలంలో ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగడం ఉత్తమం.
అదృష్ట సంఖ్య...3.
సుబ్రహ్మణ్య స్వామి ని మరియు శ్రీ మహావిష్ణువు ని పూజించడం మంచిది