ధనుస్సు (23 నవంబర్ - 22 డిసెంబర్)
ఏ ముఖ్యమైన పని చేపట్టినా ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది.
అలాగే, నిర్ణయాలలోనూ తొందరపాటు వద్దు.
బంధువులతో తరచూ విభేదాలు రావచ్చు.
అయితే ఒక మెట్టుదిగి పరిష్కరించుకుంటారు.
కొన్ని వ్యవహారాలలో కొంత త్యాగానికి రాజీ పడక తప్పని పరిస్థితి ఉంటుంది.
తీర్థ యాత్రలు సాగిస్తారు.
ఆదాయవ్యయాలు సమానంగా ఉండి ఊరట చెందుతారు.
కుటుంబంలో మీమాటే చెల్లుబాటుకు యత్నిస్తారు.
గృహం, వాహనాలు సమకూర్చుకుంటారు.
ఆగస్టు ప్రాంతంలో ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించండి.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు విస్తరణలోనూ, కొత్త పెట్టుబడుల్లోనూ కొద్దిపాటి అవరోధాలు ఎదురై సవాలుగా మారవచ్చు. సహనం అవసరం.
ఉద్యోగులకు మొదటి భాగంలో ప్రమోషన్లు వచ్చే వీలుంది. అయితే కొందరికి అధికారుల ద్వారా సమస్యలు ఎదురవుతాయి.
రాజకీయవర్గాలకు సామాన్య పరిస్థితి.
కళాకారులు అవకాశాలు దక్కించుకోవడంలో శ్రమపడతారు.
విద్యార్థులు, నిరుద్యోగులు చేసే కృషికి తగిన ఫలితం లభిస్తుంది.
ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, సెప్టెంబర్ నెలలు అనుకూలం. మిగతా నెలలు సాధారణంగా ఉంటాయి.