మేషం (21st March – 19th April) (2021)
ఈ ఏడాది గతంతో పోలిస్తే మెరుగైనదిగా చెప్పవచ్చు.
సమస్యలు, ఒడిదుడుకులతో గడిచిన గతం ఒక కలగా భావించవచ్చు.
అన్నింటా విజయకేతనం ఎగురవేసేందుకు అవకాశాలు లభిస్తాయి.
మీ మాటకు ఎదురు చెప్పేవారు ఉండరంటే అతిశయోక్తి కాదు.
కుటుంబంలో మీ అభిప్రాయాలను, సూచనలను ప్రతి ఒక్కరూ పాటిస్తారు.
శ్రమ, పట్టుదల ఆయుధాలుగా ముందుడుగు వేసి విజయాల బాటలో పయనిస్తారు.
నూతన విద్య, ఉద్యోగావకాశాలు ఊహించిన విధంగా దక్కుతాయి.
ఆదాయం విషయంలో సమస్యలు తీరి మరింత లబ్ధి పొందుతారు.
వివాహాల ప్రయత్నాలు ఫలించి ఉత్సాహవంతంగా గడుపుతారు.
అప్రయత్నంగా వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. ఇందుకు అవసరమైన సొమ్ము అందుతుంది.
శాస్త్రీయ పరిశోధకులకు విశేష గుర్తింపు లభిస్తుంది.
పట్టుదల, నేర్పరితనంతో ఎప్పటికప్పుడు కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
వ్యాపార, వాణిజ్యవర్గాల దీర్ఘకాలిక ఇబ్బందులు తొలగుతాయి.
ఉద్యోగులు నిలిచిపోయిన హోదాలు తిరిగి దక్కించుకుంటారు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులు వ్యూహాత్మకంగా మరిన్ని అవకాశాలు పొందుతారు.
టెక్నికల్ రంగం వారికి గతం కంటే మెరుగైన పరిస్థితి.
మహిళలు ప్రతిభాపాటవాలు చాటుకుంటారు.
మార్చి, మే, జూలై, అక్టోబర్, నవంబర్ నెలల్లో అన్ని విషయాలలో అప్రమత్తంగా మెలగాలి.
ముఖ్యంగా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగడం ఉత్తమం.
అలాగే, ఈ కాలంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందులు అధిగమించే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.
అదృష్ట సంఖ్య–9
దత్తాత్రేయ స్వామి మరియు సుబ్రహ్మణ్య స్వామి ని పూజించడం మంచిది