వృశ్చికం (23 అక్టోబర్ - 22 నవంబర్)
అదనపు ఆదాయం సమకూర్చుకోవడంలో సఫలమవుతారు.
కష్టాల్లో ఉన్న వారికి చేయూత అందిస్తారు.
ఇంటిలో కొన్ని వేడుకలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మీ గౌరవానికి, ప్రతిష్ఠకు ఎటువంటి భంగం లేకుండా గడిచిపోతుంది.
ఈ ఏడాది కొత్త ఉద్యోగాలు పొందుతారు.
సన్నిహితులతో కొన్ని వివాదాలు వచ్చినా నేర్పుగా పరిష్కరించుకుంటారు.
వాహనాలు, అత్యంత ఖరీదైన భూములు కొనుగోలు చేసే వీలుంది.
విదేశాలలోని బంధువుల రాక మీలో సంతోషం కలిగిస్తుంది.
సోదరుల ద్వారా ఆర్థిక , మాట సహాయం అందుతుంది.
విచిత్రమైన సంఘటనలు ఆకట్టుకుంటాయి.
శాస్త్రసాంకేతిక రంగాల వారు తమ నైపుణ్యంతో అందరినీ ఆకర్షిస్తారు.
వ్యాపార,వాణిజ్యవేత్తలు లావాదేవీలను విస్తృపరుస్తారు.
భాగస్వాములతో సర్దుబాట్లు చేసుకుంటారు.
ఉద్యోగస్తులు విధుల్లో సమస్యలను అ«ధిగమిస్తారు.
పారిశ్రామికవేత్తలు విస్తృతంగా విదేశీ పర్యటనలు చేస్తారు.
రాజకీయనేతలు తమకంటూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు.
కళాకారులకు అనుకోని అవకాశాలు.
విద్యార్థుల యత్నాలు ప్రార ంభంలో ఫలిస్తాయి.
వ్యవసాయదారులకు మిశ్రమంగా ఉంటుంది.
మధ్య కాలంలో ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగిస్తుంది.
వైద్యుల సలహాలు స్వీకరిస్తారు.
జనవరి, మార్చి, జూలై, సెప్టెంబర్ నెలల్లో విశేషంగా కలిసివస్తుంది. మిగతావి సామాన్యం.