మిథునం (21 మే - 20 జూన్)
ఈ రాశి వారికి ఏడాది చివరిలో విశేషమైన కాలమనే చెప్పాలి. గతంతో పోలిస్తే అన్ని విధాలా కలసి వస్తుంది.
ఇక రాబడి తగినంతగా ఉన్నా ఖర్చులు కూడా పెరుగుతాయి.
బంధువర్గం నుంచి విమర్శలు, కొన్ని ఆరోపణలు రావచ్చు. వాటిని సహనంతో భరించడం ఉత్తమం.
స్నేహితులు కూడా సమయానికి రిక్తహస్తాలు చూపవచ్చు.
అనుకున్న వ్యవహారాలు మరింత నిదానంగా పూర్తి కాగలవు.
ఆర్థికపరమైన హామీలు, సంతకాలకు దూరంగా ఉండండి.
కుటుంబంలో చికాకులు పెరిగి సహనాన్ని పరీక్షిస్తాయి.
ఆరోగ్యం పై తగిన శ్రద్ధ అవసరం.
భార్యాభర్తల మధ్య తరచూ వివాదాలు, మనస్పర్థలు రావచ్చు.
ఇంటి నిర్మాణ యత్నాలు ఎట్టకేలకు ప్రారంభిస్తారు.
అక్టోబర్, నవంబర్ నెలల్లో వివాహాది శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు లాభనష్టాలు సమానస్థాయిలో ఉంటాయి.
ఉద్యోగస్తులకు తమ విధులతో పాటు ఇతరుల బాధ్యతలు కూడా చేపట్టాల్సిన పరిస్థితి.
పారిశ్రామికవర్గాలకు తరచూ విదేశీ పర్యటనలు ఉంటాయి.
రాజకీయవేత్తలు క్రీడాకారులకు కొంత నిరాశాజనకమైనా తమ ఆశయాలను సాధిస్తారు.
కళాకారులకు అవకాశాలు క్రమేపీ పుంజుకోవచ్చు.
విద్యార్థులకు సామాన్యఫలితాలు.
వ్యవసాయదారులకు పెట్టుబడులు ఆలస్యమైనా అందుతాయి.
ఫిబ్రవరి, ఏప్రిల్, ఆగస్టు, అక్టోబర్ నెలలు అనుకూలం, మిగతావి సామాన్యం.