కర్కాటకం (21 జూన్ - 22 జులై)
రాబడి ఉన్నా ఖర్చులు కూడా తట్టుకోవలసిన పరిస్థితి.
చేపట్టిన కార్యక్రమాలు పూర్తి చేయడంలో కొంత వెనుకబడతారు.
ఇతరుల సాయం లేకుండా ఎటువంటి నిర్ణయం తీసుకోలేరు.
ఎంతగా కష్టించినా ఫలితం నామమాత్రమే.
సన్నిహితులు, శ్రేయోభిలాషుల నుంచి సైతం ఊహించని విధంగా విమర్శలు.
కుటుంబపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
ఇదే సమయంలో కొంత మౌనం అవసరం.
సంతానపరంగా ఇబ్బందులు రావచ్చు.
సరైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
ఇంటి నిర్మాణయత్నాలు ఆగస్టు నుండి అనుకూలించే సూచనలు.
వాహనాల విషయంలో మరింత అప్రమత్తత అవసరం.
నిరుద్యోగులకు ఎట్టకేలకు ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు లావాదేవీలు సాదాసీదాగా కొనసాగుతాయి.
ఉద్యోగులకు కోరుకున్న బదిలీలతో పాటు, బాధ్యతలు కూడా తగ్గవచ్చు.
పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందవచ్చు.
రాజకీయవర్గాల వారికి ఆగస్టు తరువాత అనుకూల పరిస్థితి.
కళాకారులు అనుకున్నది సాధించడంలో శ్రమపడాలి.
విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది.
వ్యవసాయదారులలో కొత్త ఆశలు చిగురిస్తాయి.
మార్చి, మే, సెప్టెంబర్, నవంబర్ నెలలు అనుకూలం. మిగతావి సామాన్యం.