మకరం (23rd December – 22nd January)
కొన్ని ఈతి బాధలు, సమస్యలు ఎదురైనా మొక్కవోని దీక్షతో అధిగమిస్తారు.
కుటుంబంలో శుభకార్యాలతో సందడి వాతావరణం నెలకొంటుంది.
కొన్ని నిర్ణయాలు సోదరులు వ్యతిరేకించే వీలుంది. తిరిగి వాటిని సవరించుకుంటారు.
కాంట్రాక్టర్లు, రియల్టర్లు పూర్వ వైభవం సాధిస్తారు.
మీ ఆలోచనా తీరులో మార్పులు కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరుస్తాయి.
పరపతి, హోదాలు పొందిన వ్యక్తులు మీకు తోడ్పాటు అందిస్తారు.
స్థిరాస్తులు సమకూర్చుకోవడంలో విజయం సాధిస్తారు.
తరచూ తీర్థ యాత్రలు చేయాలన్న సంకల్పం నెరవేరుతుంది.
ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు.
విద్యార్థులకు అద్భుతమైన అవకాశాలు దక్కవచ్చు.
గత కొంత కాలంగా పెండింగ్లో పడిన కొన్ని వ్యవహారాలు కొలిక్కి తెచ్చుకుంటారు.
ఆదాయ విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నా సర్దుబాటు కాగలదు.
వ్యాపార, వాణిజ్య వర్గాలకు ప్రభుత్వం నుంచి ఊహించని రాయితీలు, ప్రోత్సాహకాలు అందే సూచనలు.
పారిశ్రామికవేత్తలు,కళాకారులు గతం కంటే కొంత మెరుగైన పరిస్థితులను చూస్తారు.
రాజకీయనేతలు కొన్ని పదవులు లేదా హోదాలు అప్రయత్నంగా పొందుతారు.
వైద్యులకు విశేష గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. కొత్త పరిశోధనలు సాగిస్తారు.
వ్యవసాయదారుల కృషి ఫలిస్తుంది. అయితే ప్రథమార్థం కొంత గడ్డుగా ఉండవచ్చు.
మహిళలు ఆశించిన లక్ష్యాలవైపు సాగుతారు.
ఫిబ్రవరి, ఏప్రిల్, జూలై, ఆగస్టు, డిసెంబర్ నెలలు ప్రతికూలత అధికంగా ఉండే సూచనలు.
ఈ కాలంలో ప్రతి వ్యవహారంలోనూ మరింత అప్రమత్తత అవసరం.
ఆరోగ్యం పై దృష్టి పెట్టండి. స్థాన చలనాలు సైతం జరుగుతాయి.
అదృష్టసంఖ్య....8.
శివకేశవులిరువురిని పూజించడం మంచిది