కుంభం
ఇంత కాలం పడిన కష్టాలు తొలగుతాయి.
సేవాభావంతో ముందుకు సాగి సంఘంలో ప్రశంసలు పొందుతారు.
అనుకున్న కార్యాలను దిగ్విజయంగా పూర్తి కాగలవు.
సమాజంలో పేరుప్రతిష్ఠలు మరింత పెరుగుతాయి.
విద్యార్థుల కృషి ఫలించి మెట్టుపైకి ఎదుగుతారు.
ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి.
ఇంటి నిర్మాణాలు చేపడతారు.
కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది.
ఊహించని రీతిలో డబ్బు అందుతుంది. అవసరాలు తీరతాయి.
ఆస్తులు, పొదులు పథకాలలో పెట్టుబడులు పెడతారు.
మొత్తం మీద సొమ్ముకు లోటు రాదు.
భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు మరింత పెరుగుతాయి.
ఎదురు చూడని బంధువుల రాకతో ఉత్సాహంగా గడుపుతారు.
మీ నిర్ణయాలలో మాత్రం ఆచితూచి అడుగు వేయండి.
ఆరోగ్యం గతం కంటే మెరుగుపడుతుంది. వైద్య సేవలు కొంత తగ్గిస్తారు.
వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.
ఒడిదుడుకులు తొలగుతాయి. ఆశించిన లాభాలు తథ్యం.
ఉద్యోగాలలో మీ సత్తా చాటుకుంటారు. విధుల్లో అవాంతరాలు తొలగుతాయి.
పారిశ్రామిక, రాజకీయవేత్తలకు పురస్కారాలు, విదేశీ పర్యటనలు.
మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించండి.