కుంభం
ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగుపర్చుకునేందుకు యత్నిస్తారు.
వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మలచుకోవడంలో సఫలమవుతారు.
కొత్త వ్యక్తులు పరిచయం మీకు ఎంతో ఉపయోగపడుతుంది.
ఒకసారి మీరు చెబితే అదే శాసనంగా నిలుస్తుంది.
దూరమైన కొందరు బంధువులు తిరిగి దగ్గరవుతారు.
కుటుంబంలో శుభకార్యాల హడావిడి, బంధువుల సందడి నెలకొంటుంది.
కొన్ని భూవివాదాలు పరిష్కరించుకుంటారు.
భార్యాభర్తల మధ్య ఎడబాటు తొలగుతుంది.
సేవా మార్గంలో పయనిస్తారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలు ఇంతకాలం పడిన శ్రమ ఫలించి ఊరట చెందుతారు.
ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణుల ఆశలు ఫలిస్తాయి.
మహిళలు ఒక సంతోషకర సమాచారం అందుకుంటారు.