మేషం
అనుకున్న ఆదాయం సమకూర్చుకుంటారు.
రుణ బాధలు తొలగుతాయి.
కొన్ని సమస్యలు, వివాదాల నుండి మనోబలంతో బయపడతారు.
ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి.
విద్యార్థులు పోటీని తట్టుకుని సీట్లు సాధిస్తారు.
బంధువుల ద్వారా అందిన సమాచారం మీలో కొంత మార్పునకు సహకరిస్తుంది.
చిరకాల కోరిక నెరవేరేందుకు కుటుంబసభ్యులు సహకరిస్తారు.
వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.
వ్యతిరేకులు మీకు ఎదురు తిరిగినా మౌనం, సహనంగా ఉండడం మంచిది.
ఆధ్యాత్మిక వేత్తల ప్రసంగాలు మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.
కొన్ని రోజులుగా వేధిస్తున్న ఆరోగ్యసమస్య తీరి ఉపశమనం లభిస్తుంది.
వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంత లాభాలు అందవచ్చు.
అలాగే, భాగస్వాములు పూర్తిగా సహకరిస్తారు.
ఉద్యోగాలలో మీరు అనుకోకున్నా కొన్ని మార్పులు జరిగే వీలుంది.
అయితే అవి మీ మంచికే అని భావించండి.
పారిశ్రామికవేత్తలు, కళాకారులు ఉత్సాహంగా అడుగులు వేసి విజయాలు సాధిస్తారు.
సుందరకాండ పారాయణ మంచిది.