కన్య
ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతంగా సాగుతుంది.
మీపై గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి.
కుటుంబంలో సమస్యలు తీరి ఊరట లభిస్తుంది.
విద్యార్థులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి.
చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీ అంచనాలు, వ్యూహాలు ఫలించి శత్రువులు కూడా మిత్రులుగా మారతారు.
పరిచయాలు పెరుగుతాయి.
శాస్త్రపరిశోధన విషయాలలో ఆసక్తి చూపుతారు.
వివాహాది శుభకార్యాల నిర్వహణలో నిమగ్నమవుతారు.
ఆర్థికంగా ఇబ్బందులు తీరి కొంత పొదుపు చేసే వీలుంది.
సోదరులతో విభేదాలు పరిష్కరించుకుంటారు.
వ్యాపారాలు లాభసాటిగా కొనసాగి మరింత విస్తరిస్తారు.
ఉద్యోగాలలో చిక్కులు వీడి ముందడుగు వేస్తారు.
రాజకీయవేత్తలు, కళాకారులకు శుభవార్తలు.
మహిళలకు మానసిక ప్రశాంతత.
శివాష్టకం పఠించండి.