మకరం
ఆర్థికంగా పురోగమించేందుకు చేసే యత్నాలు ఫలించవు.
ఆలోచనలు కార్యరూపం దాల్చడంలో సన్నిహితుల సాయం అందుతుంది.
ధార్మిక చింతనలో నిమగ్నమవుతారు.
వివాదాలకు మరింత దూరంగా ఉంటే మంచిది.
ఆస్తుల విషయమై జ్ఞాతులతో విభేదాలు రావచ్చు, తెలివిగా వ్యవహరించాలి.
పొరపాటున కూడా మీ కీలక నిర్ణయాలు ఇతరులకు చెప్పవద్దు.
ఆరోగ్యసూత్రాలు పాటిస్తూ ఆహార నియమాలపై దృష్టి సారించండి.
చిన్ననాటి మిత్రులను ఊహించనిరీతిలో కలుసుకుంటారు.
కొన్ని కాంట్రాక్టులు వచ్చినా నిరాశ కలిగిస్తాయి.
వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల నిర్వహణ పై శ్రద్ధ చూపాలి.
ఉద్యోగులకు విపరీతమైన శ్రమ, కార్యభారం తప్పకపోవచ్చు.
కళాకారులు, క్రీడాకారులు అనుకున్న అవకాశాలను దూరం చేసుకుంటారు.
మహిళలకు కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు.