ధనుస్సు
ఆదాయానికి కొంతకాలంగా పడుతున్న ఇబ్బందులు «అధిగమిస్తారు.
ఒక దశలో చేతినండా సొమ్ములు ఉంటాయి.
మీ చాకచక్యం, ఓర్పు, నేర్పు ప్రస్తుతం ఎంతో ఉపకరిస్తాయి.
మీరు అడిగినదే తడవుగా స్నేహితులు సాయపడతారు.
ప్రజ్ఞాశాలురుగా గుర్తింపు లభిస్తుంది.
ఎటువంటి కార్యక్రమమైనా తేలిగ్గా పూర్తి చేస్తారు.
విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది.
చిన్ననాటి సంఘటనలను నెమరువేసుకుంటారు.
సమాజ సేవలో పాల్గొని మీ సేవాభావాన్ని చాటుకుంటారు.
ధార్మిక వేత్తల ద్వారా ఆసక్తికర సమాచారం అందుకుంటారు.
వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడుల సాధనలో విజయం, భాగస్వాములతో నూతన ఒప్పందాలు.
ఉద్యోగులకు ఎటువంటి బాధ్యత అయినా సమర్థనీయంగా నిర్వహిస్తారు.
పారిశ్రామికవేత్తలు, సాంకేతికవర్గాల వారు కొన్ని సమస్యలను అధిగమిస్తారు.
శివాష్టకం పఠించడం ఉత్తమం.