కర్కాటకం
కొత్త కార్యక్రమాలను అవాంతరాలు లేకుండా పూర్తి చేస్తారు.
సమాజంలో విశేష గౌరవ మర్యాదలు లభిస్తాయి.
చిన్ననాటి మిత్రులు సంపూర్ణంగా మీకు తోడుగా నిలవడంలో బలం చేకూరుతుంది.
వ్యతిరేక పరిస్థితులు అనుకూలించి విజయాలబాటలో నడుస్తారు.
ఆర్థిక పరిస్థితి మరింత సంతృప్తినిచ్చి అవసరాలు తీరతాయి.
సన్నిహితులతో తగాదాలు తీరతాయి.
నిరుద్యోగుల సుదీర్ఘ కల ఫలిస్తుంది.
వాహనాలు, ఇల్లు కొనుగోలు చేస్తారు.
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
వ్యాపారాలలో కొత్త పెట్టుబడులను సకాలంలో సమకూర్చుకుని విస్తరిస్తారు.
ఉద్యోగాలలో మీ మాటకు ఎదురుండదు. సేవలు విస్తృతమవుతాయి.
సాంకేతిక వర్గాలు, వైద్య నిపుణులు అనూహ్యమైన పేరుప్రతిష్ఠలు పొందుతారు.
కళాకారులకు పురస్కారాలు రావచ్చు.
కనకధారా స్తోత్రాల పఠనం ఉపయుక్తంగా ఉంటుంది.