మిథునం
కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు.
అప్రయత్నంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.
నిరుద్యోగులకు అనుకూలమైన సమయం.
వాహనాలు, స్థలాలు కొంటారు.
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.
దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి.
గతంలో చేజారిందనుకున్న సొమ్ము సైతం అందుతుంది.
కుటుంబంలో బంధువులతో మరింత సఖ్యత నెలకొంటుంది.
ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది.
పెద్దల సలహాలు పాటిస్తారు.
ఆరోగ్యపరంగా స్వల్ప రుగ్మతలు నెలకొన్నా ఉపసమనం లభిస్తుంది.
భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ఉద్యోగాల్లో ముందడుగు వేస్తారు.
పారిశ్రామికవేత్తలు, రాజకీయవేత్తలకు అనూహ్యమైన అవకాశాలు నెలకొంటాయి.
దుర్గా పూజలు మంచిది.