వృశ్చికం
కొత్త వ్యవహారాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు.
ఆత్మీయులతో అనురాగం పంచుకుంటారు.
ప్రతిభాశాలురుగా గుర్తింపు పొందుతారు.
చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి.
ఆప్తుల నుంచి శుభవర్తమానాలు రాగలవు.
ఒక ఆలోచన మీ జీవితంలో మలుపునకు కారణమవుతుంది.
నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు.
ఆర్థిక వ్యవహారాలు మునుపటి కంటే మెరుగుపడతాయి.
ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.
ఉద్యోగాలలో వివాదాలు, సమస్యలు అధిగమిస్తారు.
పారిశ్రామికవేత్తలకు మరింత ఆశాజనకమైన కాలం.
మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
శివానంద లహరి పారాయణ చేయండి.