మీనం
మీ భావాలు అందరికీ నచ్చి వెన్నంటి నిలుస్తారు.
ఆదాయం, ఖర్చులు బేరీజు వేసుకోవడంలో సఫలమవుతారు.
ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్య కార్యాలు పూర్తి చేస్తారు.
చిన్ననాటి కొన్ని విషయాలు మిత్రులు గుర్తు చేస్తారు.
ఏ స్థాయి వారినైనా నైపుణ్యంతో ఆకట్టుకుంటారు.
పరిచయాలు మరింత పెరుగుతాయి.
స్థిరాస్తులపై అగ్రిమెంట్లు పూర్తి కాగలవు.
వివాదాల నుంచి కొంత మేర బయటపడతారు.
వ్యాపారులు, వాణిజ్యవేత్తలు సంస్థల పురోగతికి మరింత పాటుపడతారు. లాభాలు తథ్యం.
ఉద్యోగుల సమర్థతను అందరూ గుర్తిస్తారు.
రాజకీయవేత్తలు, క్రీడాకారులు విశేష గుర్తింపు పొందుతారు.
మహిళలకు మానసిక ప్రశాంత చేకూరే సమయం.