సింహం
మొదట్లో ఎదురైన ఇబ్బందులు క్రమేపీ తీరి ఉపశమనం పొందుతారు.
మీ ఆలోచనలు అమలు చేసి విజయాలు సాధిస్తారు.
కొత్త విషయాలు తెలుసుకుంటారు.
ఆత్మీయుల నుంచి పిలుపుతో మరింత ఉత్సాహవంతంగా గడుపుతారు.
కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి.
విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు.
వాహన, గృహయోగాలు కలుగుతాయి.
తీర్థ యాత్రలు చేస్తారు.
అనుకున్న సమయానికి సొమ్ము సమకూరి అవసరాలు తీరతాయి.
ఆస్తుల విక్రయాలు, కుటుంబంలో ఉత్సాహవంతంగా గడుస్తుంది.
పెద్దల సలహాల మేరకు కొన్ని రుగ్మతలు తొలగి.
మరింత మెరుగ్గా ఉంటుంది.
వ్యాపారాలలో కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు.
పెట్టుబడులకు లోటు రాదు.
భాగస్వాములతో వివాదాలు పరిష్కరించుకుని ముందుకు సాగుతారు.
ఉద్యోగాలలో ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తారు. కోరుకున్న మార్పులు తథ్యం.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు, సత్కారాలు జరుగుతాయి.
మహిళలకు మానసిక ప్రశాంతత.
ఆంజనేయ దండకం పఠించండి.