వృషభం
ఆర్థిక వ్యవహారాలు గతం కంటే కాస్త మెరుగ్గా ఉంటుంది.
సన్నిహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు.
సకాలంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయం అందుతుంది.
కాంట్రాక్టర్లకు సంతోషకరమైన సమాచారం.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
స్థిరాస్తి వివాదాలు తీరి మరింత లబ్ధి చేకూరుతుంది.
వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు.
చాకచక్యంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు.
వ్యతిరేకులను కూడా అనుకూలురుగా మార్చుకుంటారు.
వ్యాపారాలు కొంతమేర పుంజుకుంటాయి.
ఉద్యోగాలలో వివాదాలు, సమస్యలు అధిగమిస్తారు.
పారిశ్రామిక, రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
మహిళలు ఆనందంగా గడుపుతారు.
శ్రీ కృష్ణాష్టకం పఠించండి.