తుల
చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.
సన్నిహితులు, మిత్రుల నుంచి కీలక సమాచారం.
ఇళ్లు, వాహనాలు కొంటారు.
ఆలయాలు సందర్శిస్తారు.
నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో విజయం.
ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి.
కొంత సొమ్ము ఆకస్మికంగా లభిస్తుంది.
బంధువుల ప్రేరణతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.
ఆరోగ్యం మరింత మెరుగ్గా ఉంటుంది.
వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
ఉద్యోగాలలో కోరుకున్న విధంగా ప్రమోషన్లు రాగలవు.
వ్యవసాయదారులు, పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.
మహిళలకు ఆస్తిలాభ సూచనలు.
వేంకటేశ్వరస్వామిని పూజించండి.