మేషం
ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.
ముఖ్యమైన పనులు ఒడిదుడుకుల మధ్యే సాగుతాయి.
సన్నిహితుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు.
ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి.
వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు వివాదాలు.
ఉద్యోగస్తులు పనిభారంతో ఉక్కిరిబిక్కిరి కాగలరు.
రాజకీయవేత్తలు, కళాకారులు విదేశీ పర్యటనలు వాయిదా వేస్తారు.
వ్యవసాయదారులు, సాంకేతిక నిపుణులకు ఒత్తిడులు.
విద్యార్థులకు సమస్యలు.
మహిళలకు ఆటుపోట్లు.
అనుకూల రంగులు.......ఎరుపు, పసుపు.
ప్రతికూల రంగు...నేరేడు.
శ్రీ రామరక్షా స్తోత్రాలు పఠించండి.