కర్కాటకం
వ్యయప్రయాసలు పెరుగుతాయి.
ముఖ్యమైన పనులు ముందుకు సాగక అసహనం చెందుతారు.
బంధువులతో చిన్నపాటి విషయాలకే వివాదాలు రావచ్చు.
ఆరోగ్య విషయంలోనూ నిర్లక్ష్యం తగదు.
దూర ప్రయాణాలకు సన్నద్ధమవుతారు.
మిత్రులు కూడా వ్యతిరేకులుగా మారవచ్చు.
ఆధ్యాత్మిక చింతనతో గడుపుతారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలు వ్యూహాత్మకంగా లాభాలు గడిస్తారు.
ఉద్యోగులపై కొంత భారం తగ్గి ఊరట కలుగుతుంది.
సాంకేతిక నిపుణులు, చిత్రపరిశ్రమ వారికి కొన్ని చిక్కులు.
విద్యార్థులు తమ మనోనిబ్బరాన్ని పెంచుకోవడం మంచిది.
మహిళలకు బంధువులతో తగాదాలు.
అనుకూల రంగులు.......గోధుమ, ఆకుపచ్చ.
ప్రతికూల రంగు ...గులాబీ.
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.