వృశ్చికం
ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేసి అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.
నిర్ణయాలలోనూ తటపటాయిస్తారు.
బంధువుల వైఖరి మీలో మానసిక ఆందోళన కలిగిస్తుంది.
రాబడి విషయంలో కొన్ని ఇబ్బందులు పడతారు.
కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి.
నిరుద్యోగులు ఎంత ప్రయత్నించినా ఫలించకపోవచ్చు.
ప్రముఖ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.
ఆరోగ్య సమస్యలు కొంత వేధించవచ్చు.
వ్యాపార, వాణిజ్యవేత్తలు ఆచితూచి ముందడుగు వేయాలి.
ఉద్యోగులపై మరింత భారం పడవచ్చు.
పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారు అవకాశాలపై సంతృప్తి చెందకపోవచ్చు.
విద్యార్థులు నిదానంగా ముందుకు సాగడం మంచిది.
మహిళలకు కుటుంబ సమస్యలు.
అనుకూల రంగులు.......ఎరుపు, ఆకుపచ్చ.
ప్రతికూల రంగు...నేరేడు.
శివ స్తోత్రాలు పఠించండి.