మకరం
నిరుద్యోగులకు ఎట్టకేలకు ఉద్యోగం దక్కవచ్చు.
ముఖ్యమైన నిర్ణయాలతో మీ తెలివితేటలను చాటుకుంటారు.
మీతో స్నేహానికి వ్యతిరేకులు కూడా ముందుకు వస్తారు.
ఆర్ధికంగా కొన్ని వెసులుబాట్లతో పుంజుకుంటారు.
ఆరోగ్యం మెరుగుపడి ఉత్సాహంగా గడుపుతారు.
కొన్ని వేడుకల్లో మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు.
మీ ఆలోచనల అమలులో ఆప్తులు సహకరిస్తారు.
వాహనాలు,స్థలాలు కొంటారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలు సమస్యల నుండి గట్టెక్కుతారు.
ఉద్యోగులకు కీలక సమాచారం.
పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారి ఆశలు ఫలిస్తాయి.
విద్యార్థులు సత్తా చాటుకుని ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.
మహిళలకు ఆస్తి లాభసూచనలు.
అనుకూల రంగులు.........ఆకుపచ్చ,తెలుపు.
ప్రతికూల రంగు...గులాబీ.
విష్ణు సహహ్రనామ పారాయణ మంచిది.