మేషం
ఆకస్మిక ప్రయాణాలతో రద్దీగా గడుపుతారు.
ఆదాయం కోసం కొంత తాపత్రయ పడతారు.
మరోవైపు మీరు చెల్లించాల్సిన మొత్తాలపై ఒత్తిడులు పెరుగుతాయి.
ఎటువంటి వివాదమైనా మీరు దూరంగా ఉండడం మంచిది.
ఇంటి నిర్మాణ యత్నాలకు కొంత విరామం ఇస్తారు.
బంధువుల ద్వారా కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు.
దేవాలయాలు సంధర్శిస్తారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు కొన్ని చికాకులు నెలకొంటాయి.
ఉద్యోగులకు అదనపు పనిభారం ఉండవచ్చు.
పారిశ్రామికవేత్తలు, చిత్రపరిశ్రమ వారికి కొత్త సమస్యలు.
విద్యార్థులకు అవకాశాలు అంతగా కనిపించవు.
మహిళలకు నిరుత్సాహమే.
అనుకూల రంగులు........గోధుమ, గులాబీ.
ప్రతికూల రంగు...ఆకుపచ్చ.
అంగారక స్తోత్రాలు పఠించండి.