మిథునం
మీరు ఏ కార్యక్రమమైనా వేగవంతంగా పూర్తి చేస్తారు.
పరిచయాలు మరింత విస్తృతమవుతాయి.
శుభకార్యాలకు కొంత సొమ్ము వెచ్చిస్తారు.
ఆస్తి వ్యవహారాలలో ఇబ్బందులు అ«ధిగమిస్తారు.
తీర్థయాత్రలకు పయనమవుతారు.
పట్టుదలతో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలు సంస్థల విస్తరణలో పురోగతి సాధిస్తారు.
ఉద్యోగులకు విధుల్లో కొత్త ఆశలు చిగురిస్తాయి.
రాజకీయ, పారిశ్రామికవేత్తలు ముఖ్య వ్యవహారాలలో తెలివిగా వ్యవహరిస్తారు.
విద్యార్థులకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.
మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం.
అనుకూల రంగులు........కాఫీ,బంగారు.
ప్రతికూల రంగు...ఎరుపు.
వేంకటేశ్వర స్వామి స్తోత్రాలను పఠిస్తే మేలు.