ధనుస్సు
ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.
కష్టపడినా ఫలితం అందదు.
వివాదాలకు దూరంగా ఉండడం శ్రేయస్కరం.
భార్యభర్తల మధ్య అకారణ వైరం.
దూర ప్రయాణాలు ఉంటాయి..
రియల్ ఎస్టేట్ల వారికి ఆటుపోట్లు.
భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
ఉద్యోగులకు అదనపు భారం మీదపడవచ్చు.
పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు తప్పవు.
కళాకారులు, ఐటీ నిపుణులకు ఒడిదుడుకులు.
మహిళలకు కుటుంబంలో చికాకులు.
షేర్ల విక్రయాలలో లాభాలు కష్టసాధ్యమే.
అదృష్ట రంగులు...గోధుమ, కాఫీ.
దత్తాత్రేయుని పూజించండి.