వృషభం
నూతన వ్యక్తుల పరిచయాలు, వేడుకల సందడితో హుషారుగా గడుపుతారు.
శుభవర్తమానాలు అందుతాయి.
మిత్రులతో మీ సంతోషాన్ని పంచుకుంటారు.
కాంట్రాక్టర్లకు అనుకూలత ఉంటుంది.
విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు.
దేవాలయాల సందర్శనం.
ఆదాయానికి ఇంతకాలం పడిన ఇబ్బందులు తొలగుతాయి.
వ్యాపార, వాణిజ్యవేత్తల కృషి ఎట్టకేలకు ఫలిస్తుంది.
ఉద్యోగులకు నిరాశాజనకమైన కాలం.
రాజకీయవేత్తలు, సాంకేతిక నిపుణులు తమ అంచనాలను నిజం చేసుకుంటారు.
విద్యార్థుల భవిష్యత్తుకు మార్గం ఏర్పడుతుంది.
మహిళలకు ఇంట్లో సమస్యల పరిష్కారం.
అనుకూల రంగులు........గోధుమ, పసుపు.
ప్రతికూల రంగు...నీలం.
శివ పంచాక్షరి పఠనం మంచిది.