మేషం
చేపట్టిన కార్యాలు ఎటువంటివైనా విజయం సాధిస్తారు.
శత్రువులను కూడా మీ పట్ల విధేయులుగా మార్చుకునే నేర్పు చూపుతారు.
కొన్ని వ్యవహారాలపై కీలక నిర్ణయాలను తీసుకుంటారు.
వాహనాలు, స్థలాలు కొంటారు.
రావలసిన డబ్బు అంది అవసరాలు తీరడమే కాకుండా రుణ విముక్తులవుతారు.
వివిధ రూపాల్లో పెట్టుబడులు కూడా పెడతారు.
అయితే ఆర్థిక విషయాలలో ఎవరినీ అతిగా నమ్మి తాళాలు వారి చేతిలో పెట్టకండి.
భార్యాభర్తలు, సోదరీసోదరుల మధ్య విభేదాలు పరిష్కారమవుతాయి.
మీ యత్నాలకు కుటుంబ సభ్యులు చేయూనిస్తారు. మీ ప్రేమాభిమానాలు అందరికీ పంచుతారు.
ఎంత ఆదరణ పొందినా మాటల సందర్భంలో మాత్రం కొంత నిదానం పాటించడం ఉత్తమం.
స్వల్ప అనారోగ్యం కలిగే అవకాశాలు. వైద్యుల సలహాలను స్వీకరించాలి.
వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. కొత్త పెట్టుబడులు సమయానుసారం అందుతాయి.
ఉద్యోగులు కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.
విధి నిర్వహణ పై కొంత అప్రమత్తంగా మెలగాలి లేదా పై స్థాయి వారితో మాటపడతారు.
రాజకీయవేత్తలకు ఉత్సాహవంతంగా గడుస్తుంది.
మహిళలకు మానసిక ప్రశాంతత.
విష్ణు సహస్రనామ పారాయణ చేయండి.