కర్కాటకం
గతంలో నిలిచిన కార్యక్రమాలు ఎట్టకేలకు పూర్తి చేస్తారు.
ఆత్మీయుల సహాయసహకారాలతో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.
కష్టాల్లో ఉన్న వారిని సైతం ఆదుకుంటారు.
ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
గతంలో జరిగిన సంఘటనలను ఒక్కొక్కటిగా గుర్తుకు తెచ్చుకుంటారు.
రాబడి ఆశాజనకంగా ఉంటుంది.
రుణ దాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు.
భూముల విక్రయాలు పూర్తయి మరింత సొమ్ము అందుకుంటారు.
ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కొన్ని అదనపు ఖర్చులు మీదపడే అవకాశం.
అందరితోనూ సంతోషదాయకంగా గడుపుతారు.
పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తారు.
కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు.
ఇంత కాలం వేధించిన కొన్ని సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
వ్యాపారాలలో గతం కంటే అధికంగా లాభాలు గడిస్తారు. పెట్టుబడులు సమకూరతాయి.
మీ అభిప్రాయాలతో భాగస్వాములు విభేదించవచ్చు. సంయమనం అవసరం.
ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో అవాంతరాలు తొలగుతాయి.
ఉన్నత పోస్టులు దక్కే అవకాశం
కళాకారులు, రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి.
మహిళలకు మానసిక ప్రశాంత చేకూరుతుంది.
దేవీ స్తోత్రాలు పఠించండి.