కర్కాటకం
కొన్ని ముఖ్య కార్యాలు నెమ్మదిగా పూర్తి కాగలవు.
ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉన్నా అవసరాలకు లోటు రాదు.
ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు.
ఆరోగ్య విషయంలో కొద్దిపాటి చికాకులు.
ఆస్తి వివాదాల నుంచి కొంతమేర బయటపడతారు.
విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం.
కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు.
శుభకార్యాలలో పాల్గొంటారు.
వ్యాపారులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు.
ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగి ఊరట లభిస్తుంది.
రాజకీయవేత్తల యత్నాలు కొంత వరకూ అనుకూలిస్తాయి.
వారం మధ్యలో వివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఖర్చులు అధికం.