సింహం
చిరకాల మిత్రుల నుంచి మీరు ఆశించిన మేర సహాయసహకారాలు అందుతాయి.
వ్యవహారాలను అప్రతిహతంగా పూర్తి చేస్తారు.
ఒకరి పరిచయం మీకు చాలా ఉపయోగకరంగా మారుతుంది.
ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి.
ఇంతకాలం ముభావంగా ఉన్న బంధువులు కొందరు తిరిగి మీపై ప్రేమాభిమానాలు కురిపిస్తారు.
సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి.
విద్యార్థులు మరిన్ని అవకాశాలు దక్కించుకుంటారు.
అప్రయత్నంగా సొమ్ము సమకూరి కొన్ని అవసరాలకు ఆదుకుంటుంది.
కుటుంబంలో అందరితోనూ ఆనందంగా గడుపుతారు.
ఆరోగ్యం కొంత మెరుగై ఊపిరి పీల్చుకుంటారు.
వృత్తులు, వ్యాపారాలలో అనుకున్న విధంగా మార్పులు జరుగుతాయి.
కళాకారులు, వైద్యులు, పారిశ్రామికవేత్తలు విజయాలను సొంతం చేసుకుంటారు.
మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
15,16 తేదీల్లో దుబారా ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు.
ఒప్పందాలు రద్దు చేసుకుంటారు.