తుల
కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు.
చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.
నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది.
ప్రత్యర్థులు స్నేహితులుగా మారి చేయూతనిస్తారు.
బంధువర్గం నుంచి ఆహ్వానాలు అందుతాయి.
ఆస్తి వివాదాలు తుది దశకు చేరతాయి.
భూ, గృహయోగ సూచనలు.
వాక్పటిమతో అందర్నీ ఆకట్టుకుంటారు.
వ్యాపారులు ఆశించిన లాభాలు అందుకుంటారు.
కొత్త పెట్టుబడులు అందుతాయి.
ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగుతాయి.
పారిశ్రామిక, రాజకీయవేత్తలకు మరింత అనుకూల సమయం.
వారారంతంలో స్నేహితుల నుంచి ఒత్తిళ్లు.
శారీరక రుగ్మతలు. దూరప్రయాణాలు.