కుంభం
దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది.
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.
మీ ఆలోచనలు అమలు చేస్తారు.
బంధువులు, స్నేహితులతో వివాదాలు సర్దుకుంటాయి.
ఆస్తులు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి.
ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీ పై వచ్చిన విమర్శలు తొలగి ఊరట చెందుతారు.
ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది.
వ్యాపారులు లాభాల దిశగా సాగుతారు.
ఉద్యోగులకు ఉన్నతహోదాలు దక్కుతాయి.
రాజకీయవేత్తలు, కళాకారులకు ఆహ్వానాలు అందుతాయి.
వారాంతంలో బంధువిరోధాలు. ఆకస్మిక ప్రయాణాలు.