మీనం
కొత్త విషయాలు తెలుస్తాయి.
ఎటువంటి కార్యాన్నైనా పట్టుదలతో పూర్తి చేస్తారు.
చిన్ననాటి స్నేహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు.
పలుకుబడి మరింత పెరుగుతుంది.
ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.
ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది.
రుణ బాధల నుంచి విముక్తి. వాహన సౌఖ్యం.
కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.
సోదరులతో వివాదాలు తీరతాయి.
ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం.
వ్యాపారస్తులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.
ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం.
పరిశోధకులు, పారిశ్రామికవేత్తలకు మరింత అనుకూలత.
వారాంతంలో దూర ప్రయాణాలు.
దేవాలయాలు సందర్శిస్తారు.