వృశ్చికం
ఆదాయం కొంత నిరాశ కలిగించవచ్చు.
అయితే అవసరాలకు ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది.
ఆప్తుల నుంచి అందిన సమాచారంతో మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది.
దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి.
కుటుంబ బాధ్యతలు క్లిష్ట పరిస్థితుల్లోనూ సమర్థవంతంగా నిర్వహిస్తారు.
భూవివాదాల నుంచి బయటపడతారు.
దేవాలయాలు సందర్శిస్తారు.
వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
వ్యాపారులు పెట్టుబడులు సమకూర్చుకుని ముందుకు సాగుతారు.
ఉద్యోగులకు విధుల్లో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు.
రాజకీయవేత్తలు, క్రీడాకారులకు పరిస్థితులు అనుకూలిస్తాయి.
వారం మధ్యలో శారీరక రుగ్మతలు.
స్నేహితులతో తగాదాలు.