మేషం
కార్యక్రమాలు సాఫీగా పూర్తి కాగలవు.
ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు.
పరపతి పెరుగుతుంది.
సన్నిహితుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది.
ఆస్తి విషయాలలో బంధువులతో తగాదాలు పరిష్కారం.
దేవాలయాలు సందర్శిస్తారు.
చిరకాల ప్రత్యర్థులు స్నేహితులుగా మారి సహకరిస్తారు.
రావలసిన డబ్బు అందుతుంది. రుణాలు తీరతాయి.
ఉద్యోగుల సేవలకు గుర్తింపు లభిస్తుంది.
వ్యాపారాలకు ఆశించిన విధంగా పెట్టుబడులు అంది ఉత్సాహంగా గడుపుతారు.
రాజకీయవర్గాలకు నూతనోత్సాహం.
క్రీడాకారులు, పరిశోధకులకు అనూహ్యమైన అవకాశాలు.
షేర్ల విక్రయాలు లాభిస్తాయి. వారారంభంలో వృథా ఖర్చులు.
మనశ్శాంతి లోపిస్తుంది.