మకరం
ఆలోచనలు స్థిరంగా ఉండవు.
వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి.
బంధువులతో ఆస్తి వివాదాలు కొంత సద్దుకుంటాయి.
వాహనాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
కొన్ని కార్యాలు నిదానిస్తాయి.
కుటుంబ బాధ్యతలు మరింతగా పెరుగుతాయి.
రావలసిన సొమ్ము అందక ఇబ్బందులు ఎదురవుతాయి.
కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు.
శారీరక రుగ్మతలు బాధిస్తాయి.
వ్యాపారులు కొద్దిపాటి లాభాలు పొందుతారు.
ఉద్యోగులకు అదనపు పనిభారం.
రాజకీయవర్గాలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
వారారంభంలో విందువినోదాలు. కార్యజయం.