కర్కాటకం
నూతన పరిచయాలతో మరింత ఉత్సాహంగా గడుపుతారు.
ఆత్మవిశ్వాసం, పట్టుదలతో కొన్ని ఇబ్బందులు అధిగమిస్తారు.
ఆదాయానికి లోటు ఉండదు.
అయితే కొన్ని అదనపు ఖర్చులు మీదపడవచ్చు.
ఆలోచనలు అమలులో కుటుంబంలో సంప్రదిస్తారు.
భూవివాదాలు పరిష్కారానికి నోచుకుంటాయి.
గతం నుంచి వేధిస్తున్న కొన్ని కేసులు, సమస్యల నుంచి విముక్తి.
శారీరక రుగ్మతలు తీరతాయి.
వాహన, కుటుంబ సౌఖ్యం.
మీ నిర్ణయాలపై అందరూ సదభిప్రాయం వ్యక్తం చేస్తారు.
సంతానం నుంచి మరింత సానుకూల సమాచారం రాగలదు.
వివాహ, ఉద్యోగ యత్నాలు కలసి వస్తాయి.
సన్నిహితుల నుంచి మాటసహాయం అందుతుంది.
అనుకున్నది సాధించాలన్న పట్టుదలతో ముందడుగు వేస్తారు.
వ్యాపారులు లాభాలను పొంది పెట్టుబడులు సైతం అందుకుంటారు.
ఉద్యోగులు పనిభారం నుంచి ఉపశమనం పొందుతారు.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత అనుకూలమైన కాలం.
క్రీడాకారులు తమసత్తా నిరూపించుకుంటారు.
వారారంభంలో వృథా ఖర్చులు.
బంధువిరోధాలు. మనశ్శాంతి లోపిస్తుంది.